Saturday, November 23, 2024

తేలిపోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

వెంటాడిన బ్యాటింగ్ వైఫల్యం, నిరాశ పరిచిన బౌలర్లు, కివీస్ దెబ్బకు కోహ్లి సేన విలవిల

India defeat in WTC Final

మన తెలంగాణ/క్రీడా విభాగం: సొంత గడ్డపై ఎంతటి పెద్ద జట్టునైనా చిత్తు చిత్తుగా ఓడించే టీమిండియా బౌన్స్‌కు సహకరించే పిచ్‌లపై మాత్రం తేలి పోవడం అనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఇంగ్లండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో కొట్టోచ్చినట్టు కనిపించింది. కివీస్ ఫాస్ట్ బౌలర్ల దెబ్బకు టీమిండియా బ్యాట్స్‌మెన్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ చేతులెత్తేశారు. ఉప ఖండంలో అసాధారణ బ్యాటింగ్‌ను కనబరిచే భారత స్టార్లు ఫాస్ట్ బౌలింగ్‌కు సహకరించే పిచ్‌లపై పేలవమైన ప్రదర్శన చేయడం పరిపాటి.
ఒక్క అర్ధ సెంచరీ లేకుండానే…
ఈసారి కూడా డబ్లూటిసి ఫైనల్లో ఆ సంప్రదాయాన్ని భారత బ్యాట్స్‌మెన్‌లు కొనసాగించారు. రెండు ఇన్నింగ్స్‌లలో కలిసి జట్టు మొత్తంలో ఒక్క బ్యాట్స్‌మన్ కూడా అర్ధ సెంచరీ మార్క్‌ను చేరుకోక పోవడం దీనికి నిదర్శనంగా చెప్పాలి. ప్రపంచంలోనే అత్యంత బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన జట్టుగా పేరున్న టీమిండియా బౌన్సీ పిచ్‌లపై మరోసారి తన బలహీనతను బహిర్గతం చేసుకుం ది. కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె వంటి ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌లు ఉన్నా కివీస్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక పోయారు. పుజారాపై భారీ ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ తేలిపోయాడు. రహానె తొలి ఇన్నింగ్స్‌లో కాస్త రాణించినా రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఓపెనర్లు రోహిత్, శుభ్‌మన్ గిల్ లు ఘోర వైఫల్యం చవిచూశారు. జట్టుకు శుభా రంభం అందించలేక పోయారు. వీరి వైఫల్యం తర్వా త వచ్చిన బ్యాట్స్‌మెన్‌పై స్పష్టంగా కనిపించింది. గిల్, రోహిత్‌లలో ఎవరూ ఒకరూ క్రీజులో నిలదొక్కుకుని ఉంటే జట్టు పరిస్థితి మరో విధంగా ఉండే ది. ఇక పుజారా, కోహ్లి, రహానెలు కూడా జట్టుకు అండగా నిలువలేక పోయారు. పుజారా ఒక్క ఇన్నింగ్స్‌లో కూడా మెరగైన బ్యాటింగ్ చేయలేక పోయాడు. అతని వైఫల్యం జట్టుపై బాగానే ప్రభా వం చూపింది. కివీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని క్రీజులో పాతుకు పోతాడని భావించినా ఫలితం లేకుండా పోయింది.
వెంటాడిన కోహ్లి వైఫల్యం
ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యాడు. కోహ్లి కనీసం ఒక్క ఇన్నింగ్స్‌లోనైనా భారీ స్కోరు సాధిం చి ఉన్నట్లయితే మ్యాచ్ ఫలితం కచ్చితంగా టీమిండియావైపే మొగ్గు చూపేదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా తన స్థాయికి తగ్గ ఆటను కనబరచడంలో విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త బాగానే ఆడినా అది జట్టును ఓటమి నుంచి రక్షించలేక పోయింది. ఆల్‌రౌండర్లుగా జట్టు లో స్థానం సంపాదించిన రవీంద్ర జడే జా, రవిచంద్రన్ అశ్విన్‌లు బ్యాటింగ్‌లో వైఫల్యం చవిచూశారు. వీరు కూడా మెరుగైన బ్యాటింగ్ చేయడంలో విఫలమయ్యా రు. ఇక టయిలెండర్ల గురించి ఎంత తక్కు వ మాట్లడితే అంత మంచిది. కివీస్‌కు చెంది న టిమ్ సౌథి, జెమీసన్ తదితరులు కీలక బ్యాటింగ్‌తో జట్టుకు మెరుగైన స్కోరును అందించడంలో ముఖ్య భూమిక పోషించారు. అయితే భారత టయిలెండర్లు మాత్రం చెత్త బ్యాటింగ్‌తో నిరాశే మిగిల్చారు. బౌలింగ్‌లో కూడా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ముఖ్యం గా ప్రధాన బౌలర్ జస్‌ప్రిత్ బుమ్రా వైఫల్యం జట్టును వెంటాడింది. రెండు ఇన్నింగ్స్‌లలోనూ బుమ్రా విఫలమయ్యాడు. ఇషాంత్, షమి లు కాస్త బాగానే బౌలింగ్ చేసినా అది జట్టుకు ప్రయోజనం కలిగించలేదు.

కివీస్‌పై ప్రశంసల వర్షం..

సౌతాంప్టన్: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ట్రోఫీని సాధించిన న్యూజిలాండ్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తన క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ఐసి సి ట్రోఫీని ముద్దాడిన కివీస్ జట్టును సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. న్యూజిలాండ్ క్రికెటర్లే కాకుండా భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, విండీ స్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా తదితర దేశాలకు చెందిన ప్రస్తు త, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కివీస్‌ను అభినందిస్తున్నా రు. అసాధారణ పోరాట పటిమతో ఐసిసి టెస్టు చాంపియన్‌గా అవతరించిన కేన్ సేనను వారు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రతికూల వాతావరణాన్ని సయితం తట్టుకుంటూ మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం సాధించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసానికి నిదర్శనమని క్రికెట్ దిగ్గజాలు గవాస్కర్, సచిన్, అలన్ బోర్డర్, జాన్‌రైట్, మెక్‌కల్లమ్, కపిల్‌దేవ్, రిచర్డ్ హ్యాడ్లి, షేన్ బాండ్ తదితరులు ప్రశంసించారు. ఇక చారిత్రక విజయం సాధించిన కివీస్ ఆటగాళ్లు బుధవారం రాత్రి సంబరాల్లో మునిగి పోయా రు. అర్ధరాత్రి వరకు ఆటగాళ్లు విజయోత్సవాన్ని జరుపుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News