Saturday, November 23, 2024

మరియమ్మ కొడుకుకి ఉద్యోగం

- Advertisement -
- Advertisement -

CLP leader Bhatti Vikramarka meets CM KCR

సిఎం కెసిఆర్‌తో సిఎల్పీ నేత భట్టి భేటీ

మన తెలంగాణ/హైదరాబాద్ : కస్టోడియల్ డెత్‌కు గురైన మరియమ్మ కొడుకుకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చారని తెలంగాణ సిఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. సిఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంఎల్‌ఎల బృందం శుక్రవారం సిఎం కెసిఆర్‌తో భేటీ అయింది. ఈ సందర్భంగా మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కస్టోడియల్ డెత్‌కు గురైన మరియమ్మ కొడుకుకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని తాము చేసిన డిమాండ్ విషయమై సిఎం సానుకూలంగా స్పందించారన్నారు. మరియమ్మ కుటుంబానికి ఇల్లు కూడా ఇచ్చేందుకు సిఎం అంగీకరించారన్నారు. మరియమ్మ బిడ్డలకు ఆర్థిక సహాయం చేయాలని తాము చేసిన వినతికి సిఎం సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని సిఎం హామీ ఇచ్చారన్నారు. లాకప్‌డెత్‌కు కారణమైరన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ అంశం గురించి తాము సిఎం దృష్టికి తీసుకెళ్తే ఆయన సిఎస్, డిజిపిని పిలిపించి తమ మధ్య ఈ విషయమై చర్చించారన్నారు. మరియమ్మ లాకప్‌డెత్ విషయమై రెండు, మూడు రోజుల క్రితమే సిఎం అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినట్లుగా ఆయన చెప్పారు. అయితే తమకు శుక్రవారం సిఎం సమయం ఇచ్చారన్నారు. తెలంగాణకు రెండో దఫా కెసిఆర్ సిఎం అయిన తర్వాత సిఎల్పీ బృందానికి తొలిసారిగా కెసిఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో సిఎంతో సిఎల్పీ నేతలు సమావేశం కావడంపై బిజెపి నేతలు విమర్శలు గుప్పించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News