Monday, November 25, 2024

టిపిసిసి మహిళా అధ్యక్షురాలిగా సునీతారావు

- Advertisement -
- Advertisement -
Sunita Rao appointed as TPCC Women President
ఆదేశాలు జారీ చేసిన ఏఐసిసి

హైదరాబాద్ : టిపిసిసి మహిళా అధ్యక్షురాలిగా సునీత రావును నియమిస్తూ ఎఐసిసి ఆదేశాలు జారీ చేసింది. టిపిసిసి ప్రక్షాళనలో భాగంగా నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపికపై కూడా కసరత్తు చేసి చివరికి సునీతారావును కాంగ్రెస్ హైకమాండ్ ఎంపిక చేసింది. రాష్ట్రానికి చెందిన నలుగురు మహిళా నేతల పూర్తి వివరాలు తెప్పించుకున్న జాతీ య మహిళా అధ్యక్షురాలు సుశ్మిత దేవ్. వారిని ఫోన్ ద్వారా ఇంటర్వూ చేసిన సంగతి విదితమే. కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయడంతో పాటు మహిళల సమస్యలను పరిష్కరించే సత్తా కలతిగిన నాయకురాలికే మహిళా అధ్యక్షురాలి పీఠాన్ని అప్పగించింది. గతంలో పిసిసి అధికార ప్రతినిధిగా సునీతారావు బాధ్యతలు నిర్వహించారు.

ఎన్‌ఎస్‌యుఐతో పాటు యూత్ కాంగ్రెస్‌లో పనిచేసి.. ప్రస్తుతం అడ్వకేట్‌గా ఉన్న సునీతారావును ఫైనల్ చేశారు. అదే విధంగా మహిళా సమస్యలపై సంపూర్ణ అవగాహన ఉండటం, భాషపై పూర్తి పట్టుండడం వంటి అంశాలతో పాటు పార్టీకి విధేయురాలిగా పనిచేసున్న భావన కూడా హైకమాండ్‌లో ఉండడంతో ఆమేకే ఈ పదవి వరించింది. కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడి పదవికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే సమానంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి పాత్ర ఉంటుంది. ఈ మహిళా విభాగం అధ్యక్ష పదవిలో ఉండే నాయకురాలు పిసిసితో సమానంగా పార్టీ కార్యకలపాల్లో పాల్గొనడంతో పాటు మహిళల సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాల్సి ఉంటుంది. కానీ సుదీర్ఘకాలంగా తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నేరేళ్ల శారద పని చేస్తున్నారు. దీంతో నూతన పిసిసి అధ్యక్షుడి ఎంపికతో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలి ఎంపిక కూడా చేపట్టాలని హైకమాండ్ నిర్ణయించిన సంగతి విదితమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News