Sunday, November 24, 2024

అత్తపై వేడి నూనె పోసిన కోడలు

- Advertisement -
- Advertisement -

daughter throws hot oil onto mother in law

అమరావతి: అత్తపై ఓ కోడలు వేడి నూనె పోసిన సంఘటన కృష్ణా జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…. గుడివాడలోని మందపాడుకు చెందిన లక్ష్మి బ్యాంకు ఖాతాలో ఇటీవల వైయస్ ఆర్ చేయూత కింద డబ్బులు జమయ్యాయి. విషయం తెలుసుకున్న కోడలు (స్వరూప)వాటిని తనకివ్వాలని కోరింది. అందుకు అత్త అంగీకరిచలేదు. దీంతో ఆగ్రహించిన స్వరూప ఆత్తపై వేడి నూనె పోసింది. తీవ్రగాయాలైన లక్ష్మిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కొడుకు శివ, కోడలు స్వరూపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

daughter throwed hot oil onto mother in law

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News