Saturday, November 16, 2024

పొగాకు వస్తువులు పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -
police seized tobacco products in hyderabad
ముగ్గురి అరెస్టు, రూ.6,13,410 పొగాకు వస్తువులు స్వాధీనం

హైదరాబాద్: పొగాకు సంబంధించిన వస్తువులు రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి రూ.6,13,410 విలువైన పొగాకు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…. కర్ణాటక రాష్ట్రం, యాద్గిరి జిల్లా, గుల్బార్గా డివిజన్, నాగాలపూర్‌కు చెందిన కాటి మల్లికార్జున్, రాజస్థాన్, పాలి జిల్లాకు చెందిన సురేష్ రామ్, సీతారాం, దినేష్ కుమార్ వ్యాపారం చేస్తున్నారు. ముగ్గురు అరెస్టు కాగా పొగాకు వస్తువులు సరఫరా చేస్తున్న దినేష్ కుమార్ పరారీలో ఉన్నాడు. రాజస్థాన్‌కు చెందిన దినేష్‌కుమార్ బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి జగద్గిరిగుట్టలో ఉంటున్నాడు.

సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. నిషేధీత పొగాకు వస్తువులు తయారు చేసి వివిధ షాపులకు సరఫరా చేస్తున్నాడు. గుట్కా, పొగాకు సంబంధించిన వస్తువులు, డూప్లికేట్ సిగరేట్లు బీదర్, కర్ణాటక రాష్ట్రం నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ విక్రయిస్తున్నాడు. హైదరాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, చిలకలగూడ, మార్కెట్, లాలాగూడ తదితర ప్రాంతాల్లో తెలిసిన వారికి సప్లయ్ చేస్తున్నాడు. తన బంధువులైన సురేష్ రామ్, సీతారాం సాయంతో వ్యాపారం చేస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. కేసు దర్యాప్తు కోసం బోయిన్‌పల్లి పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు శ్రీకాంత్, పరమేశ్వర్ తదితరులు పట్టుకున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News