Friday, November 22, 2024

చిన్నారులకు వ్యాక్సిన్ వస్తేనే స్కూళ్లు తెరవడానికి వీలవుతుంది

- Advertisement -
- Advertisement -

Availability of COVID vaccine for kids will pave way for school reopening

ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా

న్యూఢిల్లీ: ప్రస్తుతం పలు దేశాల్లో చిన్నారులకు వ్యాక్సిన్ అందిస్తుండగా, మన దేశంలో కూడా చిన్నారులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే అదొక మైలు రాయి అవుతుందని ఢిల్లీ ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాఠశాలలను పూర్తి స్థాయిలో తెరవడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందని, విద్యార్థుల చదువుకు మార్గం సుగమం అవడానికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే చిన్నారుల కోసం భారత్ బయోటెక్ ఓ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. 2నుంచి 18 సంవత్సరాల వయసు కలిగిన వారికి ఈ వ్యాక్సిన్‌ను అందించాలని లక్షంగా పెట్టుకుని ఇప్పటికే రెండు, మూడుదశల ట్రయల్స్ పూర్తి చేసింది. దీనికి సంబంధించిన డేటా సెప్టెంబర్ నాటికల్లా అందుబాటులోకి రావచ్చని గులేరియా చెప్పారు. డ్రగ్ కంట్రోలర్‌నుంచి అనుమతి లభిస్తే ఆ సమయానికి వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావచ్చని ఆయన చెప్పారు.

అంతకు ముందే భారత్‌లో ఫైజర్‌కు అనుమతి రావడం, జైడస్ క్యాడిలా కూడా వ్యాక్సిన్‌ను తీసుకు వస్తే పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవకాశాలు విస్తృతమవుతాయని గులేరియా చెప్పారు. కరోనా కాలంగా గడచిన ఏడాదిన్నర కాలంగా విద్యారులు చదువుల పరంగా భారీగా నష్టపోయారని ఎయిమ్స్ చీఫ్ అంటూ పాఠశాలలు తిరిగి తెరుచుకోవాలంటే వ్యాక్సినేషన్ ఆ విషయంలో ప్రధాన పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. చిన్న పిల్లలకు కరోనా సోకే అవకాశాలు, దాన్ని ఎదుర్కోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేయడం కోసం ఒక జాతీయ నిపుణుల కమిటీని ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. కాగా చిన్నపిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదని, తన అంచనా ప్రకారం 1218 ఏళ్ల మధ్య వయసు వారే దేశంలో దాదాపు 1314 కోట్ల మంది ఉంటారని, వీరికి వ్యాక్సిన్ ఇవ్వడానికే 2526 కోట్ల డోసులు అవసరమవుతాయని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ ఇటీవల చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News