రూ.1,96,30,000 వసూలు చేసిన నిందితుడు
అరెస్టు చేసిన సిసిఎస్ పోలీసులు
హైదరాబాద్: తక్కు వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయని చెప్పి మోసం చేసిన వ్యక్తిని నగర సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని యూసుఫ్‌గూడకు చెందిన ఎండి అలీం పాషా తుక్కు వ్యాపారం చేస్తే చాలా లాభాలు వస్తాయని చెప్పి చాలామంది వద్ద నుంచి రూ.1,96,30,000 తీసుకున్నాడు. ముందుగా పెట్టుబడి పెట్టిన వారికి మొదట్లో డబ్బులు ఇచ్చా డు. దీనిని నమ్మిన బాధితులు చాలామంది డబ్బులు ఇచ్చారు. పదిమందికిపైగా నిందితుడికి డబ్బులు ఇచ్చారు. డబ్బులు తీసుకున్న నిందితుడు మూడు నెలల నుంచి లాభాలు ఇవ్వకపోగా ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. బాధితులు నగర సిసిఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. ఎస్సై రామకృష్ణ కేసు దర్యాప్తు చేశారు.
Fraud in the name of scrap business