ముంబై: కదులుతున్న రైలు నుంచి కిందికి దిగడానికి ప్రయత్నించి పడిపోయిన ఓ వ్యక్తిని రైల్వే పోలీస్ కాపాడాడు. జూన్ 29న వెస్ట్రన్ లైన్లోని ముంబైలోని బోరివాలి రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగిందని సెంట్రల్ రైల్వే వర్గాలు తెలిపాయి. స్టేషన్ నుంచి వేగంగా వెళ్తున్న రైలు నుంచి వ్యక్తి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ప్రమాదావశాత్తు కిందపడి రైలు ప్లాట్ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. ఇది గమనించి అప్రమత్తమైన ఆర్పిఎఫ్ పోలీస్ హూటాహుటిన అతని వద్దకు పరుగెత్తుకెళ్లి ప్రమాద స్థితిలో ఉన్న అతనిని వెనక్కి లాగాడు. దీంతో అతను స్వల్పగాయాలతో బయటపడ్డాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివిలో రికార్డు అయ్యాయి.ఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు ఇలాంటి ప్రమాదాల నుండి ప్రజలను రక్షించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
#WATCH | An RPF constable saved life of a passenger who fell while trying to get down from a running at Mumbai's Borivali Railway Station on June 29. The passenger was dangerously close to the gap between the train & platform when the constable pulled him away: Central Railway pic.twitter.com/AVnYIwNQ7y
— ANI (@ANI) July 1, 2021