Saturday, November 16, 2024

నగరంలో ఉగ్రవాదుల కలకలం

- Advertisement -
- Advertisement -

NIA Arrested Two Let Operatives From Hyderabad

ఇద్దరు స్లీపర్ సెల్స్‌ను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ
ఒక్కసారిగా ఉలిక్కిపడిన నగర వాసులు

హైదరాబాద్: ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేయడం తో నగరంలో ఒక్కసారిగి కలకలం సృష్టించింది. గతంలో చాలా సార్లు స్లీపర్ సెల్స్, ఉగ్రవాదులను అరెస్టు చేయగా, స్థానిక పోలీసుల నిఘా, కేంద్ర బలగాల నిఘాతో కొంతకాలం ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. పోలీసులు పటిష్ట నిఘా పెట్టడంతో చాలామంది స్లీపర్ సెల్స్ నగరం నుంచి వెళ్లిపోయారు. గతంలో ఉగ్రవాదులు నగరాన్ని సేఫ్ జోన్‌గా భావించి ఇక్కడ వివిధ రకాల పనులు చేస్తూ స్లీపర్ సెల్స్‌గా ఉండేవారు. పై నుంచి ఆదేశాలు వచ్చే వరకు వీరు పండ్లు, వివిధ వ్యాపారాలు చేసుకునేవారు. అవసరం వచ్చినప్పుడు దేశంలో ఎక్కడ ఉన్నవారికైనా సహకరించేవారు. ఈ క్రమంలోనే బీహార్, దర్భంగాలో పేలుడుకు వాడిన మెటీరియల్‌ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పార్సిల్‌లో వచ్చాయని ఎన్‌ఐ ఏ అధికారుల దర్యాప్తులో తేలడంతో ఒక్కసారిగి నగరంపై మళ్లీ నిఘా మొదలైంది.

దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ అధికారులు ఆసిఫ్‌నగర్‌లో చీరల వ్యాపారం చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు ఇమ్రాన్, నాసిర్‌ను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకుని వెళ్లారు. అక్కడి పేళుళ్ల కేసులో నలుగురు నిందితులను ఎటిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించ గా ఇక్కడ ఉంటున్న ఇద్దరు సోదరుల విషయం బయటపడింది. స్థానికం గా పేలుడు కోసం పదార్థాలను సేకరిస్తే వెంటనే పట్టుబడుతామని గ్రహించిన ఉగ్రవాదులు తమ స్లీపర్ సెల్స్ ద్వారా వాటిని సేకరిస్తున్నా రు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు సోదరులు ఇక్కడ మూడేళ్ల నుంచి చీర ల వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం పేరుతో ఉంటున్నా ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించేందుకు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది. మాలిక్ పలుమార్లు పాకిస్థాన్‌కు వెళ్లి ఉగ్రవాదులను కలిసినట్లు ఎన్‌ఐఏ విచారణలో తేలింది.

ఉగ్రలింకులు…

నగరంలోని పాతబస్తీ, టోలీచౌకి, ఆసిఫ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఎక్కువ మంది ముస్లింలు ఉంటున్నారు. ఈ ప్రాంతాల్లో స్లీపర సెల్స్ ఉండేందుకు అనుకూలంగా ఉండడంతో చాలామంది వచ్చి ఉంటున్నారు. గతంలో పాతబస్తీలో స్లీపర్ సెల్స్, ఎక్కువగా ఉండేవారు. కాని ఇప్పుడు నగర శివారు ప్రాంతాలు, వేరే ప్రాంతాల్లో మకాం వేస్తున్నారు. దిల్‌షుక్‌నగర్ బాంబు పేళుళ్ల కేసులో ఉన్న నిందితులు నగర శివారు ప్రాంతంలో ఒంటిరిగా ఉన్న ఇంటిని అద్దెకు తీసుకుని ఉన్నారు. శివారు ప్రాంతం కావడం తో పోలీసుల నిఘా తక్కువగా ఉండడం, స్థానికులు కూడా పట్టించుకోకపోవడంతో ఇంటిలోని బాంబులు తయారు చేసి సైకిల్‌పై వచ్చి పేళుళ్లకు పాల్పడ్డారు. అప్పటి నుంచి పోలీసులు శివారు ప్రాంతాలపై నిఘా పెట్టడంతో ఉగ్రవాదులకు సహకరించేవారు నగరంలోనే వివిధ వ్యాపారాల పేరుతో ఉంటున్నారు. అవసరం ఉన్నప్పుడు పేళుళ్లకు సహకరించేందుకు అన్ని విధాల సహకరిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News