న్యూఢిల్లీ : సీరం ఇనిస్టిట్యూట్ కొవొ వాక్స్ కరోనా టీకాను పిల్లలపై ట్రయల్స్ నిర్వహించడానికి సెంట్రల్ డ్రగ్ అథారిటీ నిపుణుల కమిటీ బ్రేక్ వేసింది. 27 సంవత్సరాల పిల్లలపై ఫేజ్ 2,3 ట్రయల్స్ నిర్వహించ వద్దని సిఫార్సు చేసింది. అయితే పెద్దలపై మొదట ట్రయల్స్ పూర్తి చేయాలని ప్యానెల్ సీరం సంస్థకు సూచించింది. సీరం దేశ వ్యాప్తంగా పది కేంద్రాల్లో 211,1217 సంవత్సరాల మధ్య 920 మంది పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం డిసిజిఐకి దరఖాస్తు చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు చెందిన సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ( ఎస్‌ఈసీ) కూడా ఏ దేశం లోనూ వ్యాక్సిన్‌ను ఆమోదించలేదని పేర్కొంది. అమెరికాకు చెందిన నొవావాక్స్ ఇంక్ సంస్థ ఎస్‌విఎక్స్ కొవ్ 2373 పేరిట అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను భారత్ ఉత్పత్తి చేసేందుకు సీరం కంపెనీతో ఒప్పందం చేసుకుంది.
Govt panel says no to Serum Institute’s Covovax