Sunday, November 17, 2024

ఆగస్టు 1నుంచి కొత్త భూ విలువలు, పెంచనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీల అమలు

- Advertisement -
- Advertisement -

TS Cabinet Sub Committee discussed on land Registration

ఆగష్టు 1 నుంచి మార్కెట్ విలువలతో పాటు, కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు అమల్లోకి!
కొత్త చార్జీలు 7.5 శాతం నుంచి 9 శాతం వరకు పెంచే అవకాశం ?
ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందచేసిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు
సిఎం ఆమోదం తరువాతే..
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆగష్టు 1నుంచి మార్కెట్ విలువలతో పాటు, రిజిస్ట్రేషన్ కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు అధికారులు పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లపై (స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ) ప్రస్తుతం స్టాంప్ డ్యూటీ 4 శాతంగా, ట్రాన్స్‌ఫర్ డ్యూటీని 1.5 శాతంగా, రిజిస్ట్రేషన్ ఫీజును 0.5 శాతంగా వసూలు చేస్తోంది. మొత్తంగా 6 శాతంగా ఉన్న ఈ చార్జీలను 7.5 శాతం నుంచి 9 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయని అధికారికవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ప్రభుత్వానికి అధికారులు నివేదిక అందించారని అందులో భాగంగా తుది ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.
డాక్యుమెంట్, స్థిరాస్తులు       స్టాంప్‌డ్యూటీ     బదిలీ        రిజిస్ట్రేషన్ ఫీజు
కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో     04           1.5             0.5
ఇతర ఏరియాల్లో                  04           1.5             0.5
ప్లాట్లు, సెమీ పినిష్డ్
సేల్ కం జిపిఏ                      5      (4శాతం అడ్జెస్ట్)      0 0.5
సేల్ అగ్రిమెంట్                     04        0 0.5          (1000-, 20000)
సేల్ వితవుట్ పొజిషన్             0.5         0                0.5
డెవలప్‌మెంట్ అగ్రిమెంట్            01         0                 0.5
కం జిపిఏ
డెవలప్‌మెంట్ కం
కన్‌స్ట్రక్షన్ అగ్రిమెంట్                0.5         0                0.5
కుటుంబసభ్యుల పార్టీషన్           0.5         0               1000
కో ఓనర్ల పార్టీషన్                    1           0               1000
రిలీజ్                                 3          0               0.5
ఇంటి సభ్యుల సెటిల్మెంట్            01         0                0.5
ధ్యాన మతపరమైన                  01         0                0.5
గిప్ట్ డీడ్                             01         0.5             0.5
మార్టిగేజ్ వితవుట్ పొజిషన్         0.5         0                0.1
స్థానిక సంస్థల మార్టిగేజ్            5000        0               0.1
మార్టిగేజ్ విత్ పొజిషన్               02        1.5              0.1
టైటిల్ డీడ్ డిపాజిట్లు                0.5         0               0.5
జిపిఏ ఇతరులు                      01         0                0.5
స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ           20         0               1000
స్థానిక సంస్థలకు స్టాంపుడ్యూటీ బదలాయింపుపై…
ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ లావాదేవీపై కనీస ట్రాన్స్‌ఫర్ డ్యూటీని వసూలు చేస్తోంది. 1.5 శాతంగా క్రయ, విక్రయాల డాక్యుమెంట్ల చార్జీల్లో వీటిని వసూలు చేసి వీలైనప్పుడల్లా స్థానిక సంస్థలకు బదలాయిస్తూ వస్తోంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు, నగర పంచాయతీలు, స్పెషల్‌గ్రేడ్ మున్సిపాలిటీలులకు ప్రతి సంవత్సరం ప్రతిపాదిత 1.5 శాతం డ్యూటీ బదలాయించాలన్న నిబంధన చట్టంలో ఉంది అయితే దీనిని ఎత్తివేసే అధికారం రిజిస్ట్రేషన్ శాఖకే వదిలివేయాలని తద్వారా రిజిస్ట్రేషన్ శాఖ రాబడి పెరుగుతుందన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. దీంతో అదనంగా రూ.300 కోట్ల రాబడి ఖజానాకు అదనంగా మిగులుతుందని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆ దిశగానే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా సమాచారం.

land registration rates set up in Telangana from Aug 1!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News