హీరోలు, హీరోయిన్లు డైట్ పాటించకుంటే.. వర్కవుట్స్ చేయకుంటే వారి బాడీ షేప్‌లో మార్పులు వచ్చేస్తాయి. తద్వారా వారి సినిమా ఆఫర్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే స్టార్ హీరోలు, హీరోయిన్లు రెగ్యులర్‌గా వర్కవుట్‌లు చేయడం.. అందుకు తగ్గట్లుగా డైట్‌ను తీసుకుంటారు. కొందరు హీరోయిన్లు కాస్త ఎక్కువే తింటారు. అందుకు తగ్గట్లుగా వర్కవుట్లు చేస్తారు. కానీ హీరోయిన్ కాజల్ మాత్రం నోరు కట్టేసుకొని ఉంటుందట. ఆమె డైట్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి సుదీర్ఘ కాలం అయినా కూడా కాజల్ ఫిజిక్ విషయంలో ఏమాత్రం విమర్శలు ఎదుర్కోలేదు. పైగా గతంతో పోల్చితే ఇప్పుడే ఆమె అందంగా కనిపిస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాజల్ సుదీర్ఘ కాలంగా ఒకే తరహా డైట్ ను ఫాలో అవుతూ ఉందట.
పూర్తిగా శాఖహారి అయిన కాజల్ శరీరానికి ఎంత ప్రోటీన్‌లు కావాలో అందుకు తగ్గట్లుగా ఆహారం తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా వర్కట్‌లు చేస్తుందట. ఉదయం జొన్న రొట్టేతో మొదలు పెట్టి రాత్రి సింపుల్ గా పప్పు అన్నంతో ముగిస్తుందట. మధ్యలో ప్రోటీన్ జ్యూస్.. మిల్క్ షేక్ వంటివి తాగుతుందట. గ్రీన్ టీతో పాటు హెర్బల్ టీని కూడా తీసుకుంటుందట. తన ఆహారంలో ఎక్కువ ఫైబర్ ఉండేలా చూసుకుంటుందట కాజల్ అగర్వాల్. ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె హీరోయిన్‌గా బిజీ బిజీగానే ఉంది. తెలుగులో కాకుండా ఇతర భాషల్లో కూడా నటిస్తోంది.