న్యూఢిల్లీ: విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో అసమాన ప్రతిభను ప్రదర్శించినందుకు అందచేసే ”సుభాష్ చంద్ర బోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-2022”కు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నామినేషన్లను ఆహ్వానించింది. ఈ పురస్కారం కింద సంస్థలకు రూ. 51 లక్షలు, వ్యక్తులకు రూ. 5 లక్షలను బహుమతిగా అందచేస్తారు. ఏటా జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతి నాడు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 31వ తేదీ వరకు తెరచి ఉంటుందని కేంద్ర హోం మంత్రిత్వశాఖ ప్రతినిధి ఒకరు ట్వీట్ చేశారు. అవార్డు కింద నగదుతోపాటు ఒక ప్రశంసాపత్రాన్ని కూడా అందచేస్తారు. అవార్డు కోసం వ్యక్తిగతంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా మరో వ్యక్తిని లేదా సంస్థను నామినేట్ చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే సంస్థ లేదా వ్యక్తి విపత్తు నివారణకు సంబంధించి సంసిద్ధత, సహాయం, స్పందన, పునరావాసం, పరిశోధన, నూతన ఆవిష్కరణలు లేదా ముందస్తు హెచ్చరికలు తదితర అంశాలలో పనిచేసి ఉండాలని ప్రతినిధి తెలిపారు.
”సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్-2022”కు నామినేషన్లు ఆహ్వానం
- Advertisement -
- Advertisement -
- Advertisement -