- Advertisement -
చండీగఢ్ : పంజాబ్‌లో విద్యుత్ కొరతను నిరసిస్తూ పంజాబ్ ఆప్ చీఫ్ భగవంత్ మాన్ నేతృత్వంలో వందలాది మంది కార్యకర్తలు శనివారం ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ నివాస సమీపంలో ధర్నా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఎం ఇంటివైపు ర్యాలీగా వెళ్తున్న ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు లోకి తీసుకురాడానికి పోలీసులు జల ఫిరంగులు ప్రయోగించారు. గత కొంతకాలంగా పంజాబ్ తీవ్ర విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. రానున్న ఎన్నికల్లో విద్యుత్ కొరతనే ప్రధాన అస్త్రంగా వినియోగించుకుని అధికార కాంగ్రెస్‌ను గద్దె దించాలని ఆప్ ప్రయత్నిస్తోంది.
- Advertisement -