Saturday, November 23, 2024

రంజీ ట్రోఫీ 2021-22 సీజన్ షెడ్యూల్‌ ప్రకటన

- Advertisement -
- Advertisement -

నవంబర్16 నుంచి రంజీ ట్రోఫీ
2021-22 సీజన్ షెడ్యూల్‌ను ప్రకటించిన బిసిసిఐ

న్యూఢిల్లీ: కరోనా కారణంగా గత ఏడాది నిర్వహించలేకపోయిన దేశవాళీ క్రికెట్‌ను ఈ ఏడాది పూర్తిస్థాయిలో నిర్వహించడానికి బిసిసిఐ సిద్ధమయింది. 2021-22సీజన్‌కు సంబంధించి అన్ని స్థాయిల టోర్నమెంట్లు, మ్యాచ్‌లు నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా మొత్తం 2017 మ్యాచ్‌ల నిర్వహణకు పచ్చ జెండా ఊపింది. నవంబర్ 16నుంచి రంజీ ట్రోఫీ మొదలవుతుందని ప్రకటించింది. ఈ మేరకు బిసిసిఐ కార్యదర్శి జైషా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది కరోనా నేపథ్యంలో రంజీట్రోఫీతో పాటుగా మిగతా అన్ని టోర్నీలు జరగని విషయం తెలిసిందే. అప్పుడు కేవలం సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలను మాత్రమే నిర్వహించింది. ‘ఈ 2021 22 సీజన్ సెప్టెంబర్ 20నుంచి సీనియర్ మహిళా వన్డే టోర్నీతో ప్రాంభమవుతుంది.

ఆ తర్వాత అక్టోబర్ 27నుంచి మహిళల వన్డే చాలెంజర్ ట్రోఫీ జరుగుతుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 20నుంచి నవంబర్ 12 వరకు సయ్యద్ ముప్తాక్ అలీ టి20 ట్రోఫీ, నవంబర్16నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు రంజీట్రోఫీ లు జరగనున్నాయి. ఫిబ్రవరి 23నుంచి మార్చి 26 వరకు విజయ్ హజారే ట్రోఫీ నిర్వహించనున్నారు. బిసిసిఐ ఈ సీజన్‌ను విజయవంతంగా నిర్వహిస్తుందన్న పూర్తి నమ్మకం మాకుంది. అలాగే ఇందులో భాగమైన ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రత మాకెంతో ముఖ్యం’ అని ఆ ప్రకటన పేర్కొంది.

BCCI Released Ranji Trophy Schedule 2021-22

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News