Friday, November 22, 2024

1320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

 

రాజన్నసిరిసిల్ల: రాజన్న  సిరిసిల్ల జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. అన్నలదాసు రుచిత శ్రీహరి అనే లబ్ధిదారుడితో స్వయంగా సిఎం కెసిఆర్ గృహ ప్రవేశం చేయించారు. లబ్దిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పట్టాలను సిఎం కెసిఆర్ అందజేశారు. డబుల్ బెడ్‌రూమ్ లబ్దిదారుడి ఇంటిని కెసిఆర్ పరిశీలించారు. లబ్దిదారుడికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. రూ.83.37 కోట్ల వ్యయంతో 27 ఎకరాల్లో 1320 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగింది. అనంతరం కెసిఆర్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డ్రైవింగ్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ (ఐడీటీఆర్‌)ను ప్రారంభించారు. అనంతరం ఆయన  జిల్లా కేంద్రంలో నిర్మించిన నర్సింగ్‌ కళాశాల భవనాన్ని కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల భవనంలో ప్రత్యేక కెసిఆర్  పూజలు చేశారు. అనంతరం కెసిఆర్  జిల్లా కేంద్రం శివారు  సర్ధాపూర్‌ గ్రామంలో నిర్మించిన మార్కెట్‌ యార్డును  ప్రారంభించారు. సిరిసిల్ల‌లో స‌క‌ల సౌక‌ర్యాల‌తో నిర్మించిన స‌మీకృత క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని కూడా కెసిఆర్ ప్రారంభించారు. స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌ల‌తో క‌లెక్ట‌ర్ కృష్ణ‌భాస్క‌ర్‌ కూర్చిలో ఆసీనుల‌య్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News