Monday, November 25, 2024

ఎయిర్‌ఫోర్స్ విమానం కూలి 31మంది సైనికులు మృతి

- Advertisement -
- Advertisement -

ఎయిర్‌ఫోర్స్ విమానం కూలి 31 మంది సైనికులు మృతి
50 మందిని కాపాడిన రెస్కూ సిబ్బంది

మనీల: ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఆదివారం 92 మంది సైనికులతో వెళ్తున్న ఎయిర్‌ఫోర్స్ సి130 విమానం జోలోద్వీపం వద్ద కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కనీసం 31 మంది మరణించగా, మరో 50 మందిని రెస్కూ సిబ్బంది మండుతున్న విమాన శిథిలాలనుంచి కాపాడినట్లు అధికారులు తెలిపారు.సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు రక్షణ మంత్రి డెల్ఫిన్ లోరెంజానా చెప్పారు. ప్రమాదం జరఇగినప్పుడు విమానంలో 92మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు పైలట్లు, ఐదుగురు సిబ్బంది కాగా, మిగతా వారంతా సైనికులే. పైలట్లు ప్రాణాలతో బైటపడ్డారు కానీ తీవ్రంగా గాయపడ్డారని, కనీసం నలుగురు గ్రామస్థులు కూడా గాయపడ్డారని అధికారులు చెప్పారు.

మిలిటరీ సాయం కింద అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఫిలిప్పీన్స్‌కు అందజేసిన రెండు సి130 హెర్కులస్ విమానాల్లో ఇది ఒకటి. ఆదివారం మధ్యాహ్నం సమయంలో సులు ప్రావిన్స్‌లోని పటికుల్ పర్వత పట్టణంలోని బంగికుల్ గ్రామంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు ఆ దేశ సాయుధ దళాల చీఫ్ సిరిలిటో సోబెజాన చెప్పారు. 50 మందిని కాపాడి ఆస్పత్రుల్లో చేర్చినట్లు ఆయన చెప్పారు. విమానం నేలను తాకడానికి ముందే చాలా మంది సైనికులు విమానంలోంచి దూకేశారని, ఫలితంగా వారంతా పేలుడునుంచి తప్పించుకున్నారని సైనికాధికారులు చెప్పారు. ప్రాథమికంగా విడుదల చేసిన చిత్రాల్లో విమానం తోక మాత్రమే కనిపిస్తుండగా, మిగతా భాగాలన్నీ కొబ్బరి చెట్లతో నిండి ఉన్న ప్రాంతంలో చెల్లా చెదరుగా పడి ఉండడం కనిపించింది. ప్రమాదానికి కారణాలు వెంటనే తెలియరానప్పటికీ విమానం రన్‌వేను మిస్ కావడం వల్లనే ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనాలను బట్టి తెలుస్తోంది.

29 dead as Military plane crashes in Philippines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News