Friday, November 22, 2024

బహిరంగంగా ఖైదీలతో శృంగారం…

- Advertisement -
- Advertisement -

Female Prison Officer Who Had Sex With prisoners

 

కాలిఫోర్నియా: జైలులో ఖైదీలతో విచ్చలవిడిగా శృంగారం చేసిన అధికారిణికి రెండేళ్ల పాటు విధుల నుంచి తొలగించడంతో ఆమెకు ఏడు నెలల జైలు శిక్ష విధించిన సంఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. టీనా గొంజాలెజ్ (26) అనే అధికారిణి 2016 నుంచి కౌంటీ జైలులో పని చేస్తున్నారు. విధుల నిర్వహిస్తున్న సమయంలో ఖైదీలతో బహిరంగంగా శృంగారంలో పాల్గొనేది. ఓ సారి 11 మంది ఖైదీలు చూస్తుండగానే మరో ఖైదీతో శృంగారంలో పాల్గొంది. ఖైదీలకు సెల్‌ఫోన్లు, బ్లేడులతో ఇవ్వడంతో పాటు వారితో పోన్లలో అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడేది. ఎప్పుడైనా జైలు సోదాలు జరిగే విషయం ముందుగానే ఖైదీలకు చెప్పేది. కోర్టులో కేసు సంబందించిన వాదనలు విన్నప్పుడు న్యాయమూర్తి షాక్‌కు గురయ్యారు. ఆమె అతి దారుణంగా ప్రవర్తించి కెరీర్‌ను నాశనం చేసుకున్నావని వ్యాఖ్యనించాడు. ఆమె గతంలో నేర చరిత్ర లేకపోవడంతో శిక్ష కాల వ్యవధిని తగ్గించారు. రెండేళ్ల పాటు విధుల నుంచి తొలగించడంతో పాటు ఏడు నెలల జైలు శిక్ష విదిస్తున్నట్టు న్యాయమూర్తి తీర్పు వెలవరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News