Sunday, November 24, 2024

6k బ్యాటరీతో సామ్‌సంగ్ F22

- Advertisement -
- Advertisement -

Samsung F22 with 6k battery

 

న్యూఢిల్లీ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ సామ్‌సంగ్ తాజాగా మరో స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. బడ్జెట్ ధరలో మెరుగైన ఫీచర్స్ తో గెలాక్సీ F22 ఫోన్ ను తీసుకొచ్చింది. గతంలో విడుదలైన మోడల్స్ తో పోలిస్తే ఎఫ్22 లో కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్ ప్లే పరంగా కీలక మార్పులు చేశారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యు ఐ 3.1 ఓఎస్ తో పనిచేస్తుంది. 90Hz రిఫ్రెషర్ తో 6.4 అంగుళాల హెచ్ డి+ఎస్ అమోలెడ్ ఇన్ఫీనిటీ-యు డిస్ ప్లే ఇస్తున్నారు. వెనకవైపు 48 ఎంపి ప్రధాన కెమెరాతో పాటు 8ఎంపి అల్ట్రావైడ్ కెమెరా, రెండు 2ఎంపి కెమెరాలున్నాయి. ముందుభాగంలో 13 ఎంపి సెల్ఫీ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ లో 6000ఎంఎహచ్ బ్యాటరీ ఉంది. 15వాట్ యుఎస్ బి-సి టైప్ ఛార్జర్ ఇస్తున్నారు. ఇది 25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. గెలాక్సీ ఎఫ్22 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4జిబి ర్యామ్/64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499, 6జిబి ర్యామ్/128జిబి ధర రూ.14,499. జులై 13 నుంచి సామ్ సంగ్ ఆన్ లైన్ స్టోర్, ఫ్లిప్ కార్ట్ లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News