హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 1,98,207 మందికి టీకా వేసినట్లు ఆరోగ్యశాఖ వ్యాక్సిన్ బులిటెన్‌లో పేర్కొంది. వీరిలో 1,38,055 మంది మొదటి డోసు తీసుకోగా, 60,152 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు 3,00,798 మంది హెల్త్‌కేర్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా 2,10,965 మంది రెండో డోసు తీసుకున్నారు. అదే విధంగా 3,10,968 మంది ఫ్రంట్‌లైన్ వర్కర్లు మొదటి డోసు తీసుకోగా, 1,39,423 మంది సెకండ్ డోసు వేసుకున్నారు. దీంతో పాటు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 43,70,310 మంది మొదటి, 1,02,344 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక 45 ఏళ్ల పై బడిన వారిలో 50,94,507మంది మొదటి, 12,99,262 మంది రెండో డోసు తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,00,76,583 మంది తొలి, 17,51,994 మంది రెండో డోసును పూర్తి చేసుకున్నారు. ఇక కొవిన్‌లో నమోదైన 101,13,870 డోసుల్లో 62,970 ఆర్మీకి కేటాయించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్‌లో 104,14,615 డోసులు వినియోగించగా, వ్యాక్సిన్ వేస్టేజ్ 3.62 శాతం తేలింది.