- Advertisement -
అహ్మదాబాద్: క్యారీ బ్యాగ్‌కు రూ.10 అదనంగా వసూలు చేసినందుకు గుజరాత్‌లోని ఓ వస్త్ర దుకాణం యజమానికి వినియోగదారుల కోర్టు రూ.1500 జరిమానా విధించింది. మౌలిన్ ఫదియా అనే వ్యక్తి ఫిర్యాదుమేరకు విచారణ చేపట్టిన వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(అహ్మదాబాద్ రూరల్) ఈ ఆదేశాలిచ్చింది. వినియోగదారుడిని మానసికంగా వేధించినందుకు రూ.1000, లీగల్ ఖర్చుల నిమిత్తం రూ.500 పరిహారంగా చెల్లించాలని కమిషన్ ఆదేశించింది. 30 రోజుల్లోగా తమ ఆదేశాలు అమలు కావాలని తెలిపింది. మౌలిన్ ఫదియా ఓ వస్త్ర దుకాణంలో రూ. 2486 విలువైన వస్తువుల్ని కొనుగోలు చేశారు. వాటిని తీసుకెళ్లేందుకు షాపులో ఇచ్చిన పేపర్ క్యారీ బ్యాగ్‌కు రూ.10 అదనంగా దుకాణదారు బిల్లు చేశారు. దాంతో, మౌలిన్ వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా విచారణ జరిపి ఈ ఆదేశాలిచ్చారు.
- Advertisement -