స్టాన్‌స్వామి మృతిపై రాష్ట్రపతికి 10 పార్టీల లేఖ.. బాధ్యులపై చర్యలకు డిమాండ్
న్యూఢిల్లీ: ఫాదర్ స్టాన్‌స్వామి మరణం పట్ల పది ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. ఆదివాసీల హక్కుల కోసం పని చేసిన స్టాన్‌స్వామిపై తప్పుడు కేసులకు బాధ్యులైనవారిని జవాబుదారీగా చేయడానికి జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌కు ఆ పార్టీల నేతలు మంగళవారం ఓ లేఖ రాశారు. జైలులో స్టాన్‌స్వామి పట్ల అమానవీయంగా వ్యవహరించారని లేఖలో గుర్తు చేశారు. నిర్బంధంలో ఉండగా స్టాన్‌స్వామి మరణించడం తమకు తీవ్ర ఆందోళన కలిగించిందని లేఖలో పేర్కొన్నారు. లేఖపై సంతకాలు చేసినవారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్‌సిపి చీఫ్ శరద్‌పవార్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్, జెడిఎస్ నేత, మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఆర్జెడి నేత తేజస్వీయాదవ్, సిపిఐ నేత డి.రాజా, సిపిఐ(ఎం) నేత సీతారామ్ ఏచూరి ఉన్నారు.
False case against Father Stan Swamy