నూన్యఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నప్పటికీ కేసులు, మరణాల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా 19,07,216 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 43,733 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 26 శాతం పెరుగుదల కనిపించింది. దాంతో మొత్తం కేసులు 30,66,36,553 కు చేరాయి. గత 24 గంటల్లో 930 మంది మృతి చెందారు. ముందు రోజు 553 మంది మృతి చెందగా, తాజాగా ఆ సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు 4,04,211 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం 4,53,920 మంది కరోనాతో బాధ పడుతున్నారు. మంగళవారం ఒక్క రోజే 47,240 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 2.98 కోట్లకు చేరాయి. క్రియాశీల రేటు 1.50 శాతానికి తగ్గగా రికవరీ రేటు 97.18 శాతానికి చేరింది. మంగళవారం 36,05,998 మంది టీకాలు తీసుకోగా, ఇప్పటివరకు 36,13,23,518 డోసులు పంపిణీ అయ్యాయి.