హైదరాబాద్: తెలంగాణ భారీ పెట్టుబడి రాబోతుండడంతో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. జీనోమ్ వ్యాలీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు కెనడా కంపెనీ ఇవాన్ హోకేంబ్రిడ్జ్ అండ్ లైట్‌హౌజ్ కాంటన్ ప్రకటించింది. మంత్రి కెటిఆర్‌తో కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం సమావేశమైంది. భారీ పెట్టుబడి పెడుతున్న కంపెనీకి మంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా రూ.740 కోట్లతో సదరు కంపెనీ భారీ పెట్టుబడి పెట్టనుంది. పది లక్షల స్కేర్ ఫీట్ల విస్తీర్ణంలో ల్యాబ్ స్పేస్ ఏర్పాటు చేస్తామని సదరు కంపెనీ ఎండి చాణక్య చక్రవర్తి తెలిపారు. ఇవాన్ హో కేంబ్రిడ్జ్ భారీ పెట్టుబడితో లైఫ్ సైన్సెస్ తో పాటు మౌలిక రంగ వసతుల కల్పన జరగనుంది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే 200కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు ఉన్నాయి. జీనోమ్ వ్యాలీలో మరింత ల్యాబరేటరీ స్పేస్ పెరగటంతో పాటు పరిశోధన, అభివృద్ధి, లైఫ్ సైన్సెస్ వసతులు మరింత పెరగనున్నాయి.
తెలంగాణకు రూ. 740 కోట్ల భారీ పెట్టుబడి…..
- Advertisement -
- Advertisement -
- Advertisement -