Tuesday, November 26, 2024

ఢిల్లీ హైకోర్టును 8 వారాల గడువు కోరిన ట్విటర్

- Advertisement -
- Advertisement -

Twitter seeks 8 week deadline for Delhi High Court

ఫిర్యాదులు స్వీకరించే అధికారి నియామకం విషయంలో …

న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు వార్నింగ్‌తో ఎట్టకేలకు ట్విటర్ దిగి వచ్చింది. భారత్‌లో ఫిర్యాదులు స్వీకరించే అధికారిని నియమించడానికి ఎనిమిది వారాల గడువు ఇవ్వాల్సిందిగా గురువారం కోర్టును అభ్యర్థించింది. భారత్‌కు చెందిన ఇంటీరియమ్ చీఫ్ కాంప్లియన్స్ ఆఫీసర్‌ను రెండు రోజుల క్రితమే నియమించామని, మరో ఇద్దరు ఎగ్జిక్యూటివ్‌లను కూడా నిర్ణీత కాల వ్యవధిలో కొత్త నిబంధనల ప్రకారం నియమిస్తామని కోర్టుకు వివరించింది. పూర్తి స్థాయి అధికారికి ఎనిమిది వారాల్లో బాధ్యతలు అప్పగిస్తామని తెలియచేసింది. అలాగే ఐటి నిబంధనలకు అనుగుణంగా భారత దేశంలో అనుసంధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పింది. ఇక ఈ మూడు పొజిషన్ల కోసం జాబ్ ఓపెనింగ్స్ ప్రకటనలు ఇచ్చినట్టు వెల్లడించింది. కొత్త ఐటి నిబంధనల విషయంలో కేంద్రానికి, ట్విటర్‌కు మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. కొత్త నిబంధనలను ధిక్కరించాలని ట్విటర్ అనుకుంటోందా ? అని కోర్టు ప్రశ్నించగా ఇప్పటి వరకు తాము నిబంధనలు అమలు చేయలేదని , వాటి అమలుకు అవసరమైన ప్రక్రియ మొదలు పెట్టామని ట్విటర్ సమాధానం ఇచ్చింది. ఫిర్యాదులు స్వీకరించే అధికారి నియామకానికి నచ్చినన్ని రోజులు తీసుకుంటే కుదరదని కోర్టు అభ్యంతరం చెప్పగా, ట్విటర్ నుంచి తాజా స్పందన వెలువడింది.

ట్విటర్‌కు కొత్త మంత్రి వార్నింగ్

ఇదిలా ఉండగా కేంద్ర రైల్వే, ఐటి శాఖ మంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టిన అశ్విని వైష్ణవ్, వచ్చీ రాగానే ట్విటర్‌కు వార్నింగ్ ఇచ్చారు. భారత్ గడ్డపై రూపు దిద్దుకున్న చట్టాలు అత్యున్నతమైనవని, దేశంలో నివసించే, పనిచేసే వారు ఇక్కడి నిబంధనలు కచ్చితంగా పాటించక తప్పదని స్పష్టం చేశారు. బిజెపి ఆర్గనైజేషన్ సెక్రటరీతో ఆయన గురువారం భేటీ అయిన తరువాత మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ట్విటర్ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. మాజీఐటి మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా అనేక సార్లు ట్విటర్‌కు ఇదే విధంగా వార్నింగ్‌లు ఇచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News