Friday, November 22, 2024

పెళ్లి కావడంలేదని మహిళా ఎస్ఐ ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Women SI commit suicide in Madhya Pradesh

 

భోపాల్: పెళ్లి కావడం లేదని ఓ మహిళా ఎస్‌ఐ పోలీస్ స్టేషన్‌లో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కవితా సోలంకి(35) అనే మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. 35 సంవత్సరాల వయసు వచ్చిన పెళ్లి కావడంతో తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఎక్కడికి వెళ్లిన బంధువులు, స్నేహితులు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావని అడుగుతుండడంతో డిప్రెషన్‌కు గురైంది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా విషం తాగింది. సహోద్యోగులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మహిళా ఎస్‌ఐ చికిత్స పొందుతూ చనిపోయింది. సూసైడ్ లెటర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెళ్లి జరగడంలేదని ఆత్మహత్య చేసుకున్నట్టుగా లెటర్‌లో ఉందని ఎస్‌వి గౌరవ్ తివారి తెలిపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News