Saturday, November 23, 2024

కూతురి దర్శకత్వంలో మరో సినిమా

- Advertisement -
- Advertisement -

Rajinikanth's next film will be directed by his daughter

 

సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నాత్తే’ షూటింగ్‌ను పూర్తి చేసి అమెరికా వెళ్లాడు. అక్కడ చికిత్స నిమిత్తం కొన్ని నెలల పాటు ఉంటాడు. ఆ తర్వాత ఆయన ఇండియా వచ్చి కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ‘అన్నాత్తే’ సినిమా దీపావళికి విడుదల కాబోతోంది. అంతకుముందే రజనీకాంత్ తదుపరి సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలిసింది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఆ సినిమా విడుదల కాబోతున్నట్లుగా కూడా చెబుతున్నారు. అయితే ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నది ఎవరు అనే విషయమై చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం రజనీకాంత్ తదుపరి సినిమాకు ఆయన కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తుందట. రజనీకాంత్ గతంలో తన కూతురు సౌందర్య దర్శకత్వంలో ‘కొచ్చాడియన్’ అనే సినిమా చేశాడు.

ఆ సినిమా పూర్తిగా మోషన్ గ్రాఫిక్స్ టెక్నాలజీతో రూపొందించారు. ఆ సినిమా బాక్సాఫీస్ ముందు డిజాస్టర్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత సౌందర్య ఒక సినిమాను తెరకెక్కించింది. ధనుష్ హీరోగా నటించిన ఆ సినిమా కూడా నిరాశ పర్చింది. అయితే వెబ్ సిరీస్, ఇతర షోలతో ఎప్పుడూ ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటూ వస్తున్న సౌందర్య మంచి రచయిత అనే టాక్ ఉంది. అందుకే మరోసారి కూతురు దర్శకత్వంలో సినిమా చేసేందుకు రజినీకాంత్ ఓకే చెప్పినట్లుగా తెలిసింది. ఈసారి తన తండ్రికి ఖచ్చితంగా ఒక సూపర్ హిట్‌ను ఇస్తాననే నమ్మకంతో సౌందర్య ఉందట. సౌందర్య కథ సిద్ధం చేసిందని.. ప్రముఖ రచయితలతో కలిసి స్రిప్ట్‌ను కూడా ఆమె సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది. రజనీకాంత్ అమెరికా నుండి వచ్చిన వెంటనే షూటింగ్‌ను మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News