వరంగల్ క్రైం : రద్దీగా ఉన్న బస్సుల్లో, ఆటోల్లో ప్రయాణిస్తూ ఒంటరిగా ఉన్న మహిళలే లక్ష్యంగా చేసుకొని మహిళల పర్సుల్లో బంగారు ఆభరణాలకు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు కిలాడీ మహిళలను సిసిఎస్, లింగాలఘన్‌పూర్ పోలీసులు సంయుక్తకంగా కలిసి అరెస్ట్ చేశారు. వీరి నుండి పోలీసులు రూ.24 లక్షల విలువగల 473 గ్రాముల విలువగల బంగారు ఆభరణాలు, నాలుగు సెల్‌ఫోన్లు, వీరు దొంగతనాలకు పాల్పడిన అనంతరం తప్పించుకునేందుకు వినియోగించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో అక్షింతల సంధ్య అలియాస్ దివ్య, అలియాస్ రాణి, బోయ కవితలు బుధవారిపేట, కర్నూల్ పట్టణం, ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రం, ప్రస్తుత నివాసం నాగోల్ ఎల్‌బినగర్ హైదరాబాద్‌కు చెందిన వారు.. ఈ కిలాడీ లేడీల అరెస్ట్‌కు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి వివరాలను వెల్లడించారు.
నిందితురాళ్లు ఇద్దరు తమ అనుచరులతో కలిసి లింగాలఘన్‌పూర్ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం రావడంతో శనివారం ఉదయం నిందితురాళ్లు నెల్లుట్ల బైపాస్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తున్నట్లుగా సమాచారం రావడంతో సిసిఎస్ ఇన్స్‌పెక్టర్లు, లింగాలఘన్‌పూర్ ఎస్సై తమ సిబ్బంది వెళ్లి నిందితురాళ్లను అదుపులోకి తీసుకోగా, కారులో ఉన్న వీరి అనుచరులు పోలీసులను గమనించి కారు వదిలి అక్కడి నుండి తప్పించుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు లేడి కిలాడీలను పోలీసులు విచారించగా నిందితురాళ్లు పాల్పడిన చోరీలను పోలీసుల ఎదుట అంగీకరించారు. కిలాడీలేడీలను అరెస్ట్ చేసి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సెంట్రల్‌జోన్ డిసిపి పుష్ప, ఘన్‌పూర్ ఎఎస్పి వైభవ్‌గైక్వాడ్, క్రైం ఎసిపి బాబురావు, సిసిఎస్ ఇన్స్‌పెక్టర్లు రమేష్‌కుమార్, శ్రీనివాస్‌రావు, జనగాం రూరల్ ఇన్స్‌పెక్టర్ వినయ్‌కుమార్, లింగాలఘన్‌పూర్, ఎస్సై దేవేందర్, అసిస్టెంట్ అనాలటిక్ ఆఫీసర్ సల్మాన్‌పాషా, సిసిఎస్ మహిళా ఎస్సైలు ఫర్వీన్, రాజేశ్వరి, ఎఎస్సై శివకుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు రవికుమార్, అహ్మద్‌పాషా, జంపయ్య, కానిస్టేబుళ్లు మహమ్మద్‌అలీ, వేణుగోపాల్, రాజశేఖర్, చంద్రశేఖర్, నజీరుద్దీన్, మహిళా కానిస్టేబుళ్లు సంధ్య, నర్మద, లావణ్యలను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించారు.