మన తెలంగాణ, హైదరాబాద్ : నగరానికి ఊపిరితిత్తుల మార్పిడి కోసం లక్నో రామ్మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆప్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డా.శారదా సుమన్ అనే పీజి వైద్యురాలికి కోవిడ్ సోకడంతో ఆమె ఊపిరితిత్తులు దెబ్బతినడంతో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం తీసుకొచ్చారు. అప్పటికే ఆమె 8 నెలల గర్భవతి పరిస్దితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్‌పై పెట్టి, ముందుగా మే 1వ తేదీన అత్యవసర సిజేరియన్ శస్త్రచికిత్స చేసిను కాపాడారు. ప్రసవం తరువాత ఎక్మో సపోర్ట్ ఉంచారు. తరువాత ఉత్తరప్రదేశ్‌కు చెందిన వైద్య బృందం దేశంలో నాలుగు మెట్రో నగరాల్లో సంప్రందించి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ఎలాంటి ఆలస్యం లేకుండా చికిత్స జరుగుతుందని.. ఇప్పటికే అక్కడ పలు సందర్భాలో ఊపిరితిత్తుల శస్త్ర చికిత్సలు విజయవంతంగా జరిగాయని తెలిసి, ఆసుపత్రినే ఎంచుకున్నారు. తొలుత ఆర్ఎంఎల్ఐఎంఎస్ నుంచి లైప్ సపోర్ట్ అంబులెన్సు ద్వారా లక్నో విమానాశ్రయానికి అక్కడ నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు డా.శారద సుమన్‌ను తరలించారు.