మహబూబ్ నగర్: తెలంగాణ ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద కెసిఆర్ అర్బన్ ఎకో పార్క్ (2 వేల 87 ఎకరాల విస్తీర్ణంలో) లో జిల్లాకు చెందిన మహిళా సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడలేని విధంగా 2 కోట్ల 8 లక్షల విత్తన బంతులను తయారు చేసి వాటిని విజయవంతంగా వివిధ కోణాల్లో వెదజెల్లే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెసిఆర్ ఎకో అర్బన్ పార్క్ లో సంతోష్ కుమార్ మొక్కలను నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు, ఎస్ పి వెంకటేశ్వర్లు, ఆదనపు కలెక్టర్ తేజాస్ నందులాల్ పవర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ. రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కెసి నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, గ్రీన్ ఇండియా ప్రతినిధులు రాఘవ, వెంకటేష్, మాజీ మార్కెట్ చైర్మన్ రాజేశ్వర్, డిఎఫ్ఒ గంగిరెడ్డి, అటవీశాఖ అధికారులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.