Saturday, November 23, 2024

ఉత్తర భారతానికి పిడుగుపాట్లు

- Advertisement -
- Advertisement -

74 people were killed by thunderbolt in North India

మొత్తం 74 మంది దుర్మరణం
యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్ విలవిల
రుతుపవన వేళ ఆకాశపు వైపరీత్యం
రాజస్థాన్ కోటవద్ద పర్యాటకులు బలి

లక్నో /jజైపూర్/ భోపాల్ : ఉత్తర, పశ్చిమ భారతంలో ఉరుముల మెరుపుల భారీ వర్షాల నడుమ పిడుగుపాట్లు బీభత్సం సృష్టించాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఆదివారం రాత్రి సంభవించిన వేర్వేరు పిడుగుపాట్లతో మొత్తం 74 మంది వరకూ దుర్మరణం చెందారు. అయితే మారుమూల ప్రాంతాలలో నుంచి ఇప్పటికీ ఈ ప్రకృతి వైపరీత్య ఘటనలపై వార్తలు అందాల్సి ఉంది. సోమవారం అధికారవర్గాలు జరిగిన ప్రాణనష్టం గురించి తెలిపాయి. ఆదివారం రాత్రి కుండపోతగా వర్షాలు పిడుగులతో పడటంతో యుపి, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో పలు ప్రాంతాలలో భయానక పరిస్థితి ఏర్పడింది. ఆదివారం అర్థరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకూ కూడా పలు చోట్ల ఆకాశంలో భారీ మెరుపులతో పిడుగులు ఆగకుండా పడుతూ వచ్చాయి. ఎక్కువగా ఉత్తరప్రదేశ్‌లోనే భారీస్థాయిలో ప్రాణనష్టం వాటిల్లింది. పలువురు ప్రాణాలు కోల్పోయ్యారని, పశువులు మృతి చెందాయని అధికారులు తెలిపారు. ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే అత్యధికంగా 14 మంది పిడుగుపాట్లకు గురై మృతి చెందారు. చెట్ల కింద ఆశ్రయం పొంది ఉన్న వారు అక్కడికక్కడే మృతి చెందారు.

రాజస్థాన్‌లో చారిత్రక జైపూర్ కోట వద్ద సెల్ఫీలు తీసుకుంటున్న వారిలో 11 మంది చనిపొయ్యారు. రాష్ట్రాలవారిగా చూస్తే యుపిలో 41 మంది, రాజస్థాన్‌లో 23 మంది, మధ్యప్రదేశ్‌లో దాదాపు 11 మంది వరకూ విషాదాంతం చెందారు. ఈ పిడుగుపాట్ల ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. పిఎం రిలీఫ్ ఫండ్ నుంచి పరిహారం ప్రకటించారు. రాష్ట్రాల ప్రభుత్వాలు వేర్వేరుగా బాధిత కుటుంబాలకు రూ 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాయి. యుపిలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలలోనే పిడుగులు పడ్డాయి. మృతులలో ఎక్కువగా పిల్లలు , మహిళలే ఉన్నారు. 16 జిల్లాలు పిడుగుపాటుకు గురయ్యాయని పలురు గాయపడి చికిత్స పొందుతున్నారని అధికార వర్గాలు తెలిపాయి. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందిస్తామని లక్నోలో సిఎం యోగి ఆదిత్యానాథ్ తెలిపారు. రాజస్థాన్‌లో పురాతన కోట బురుజుల వద్ద నిలబడి సెల్‌ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్న వారిపై పిడుగులు పడిన ఘటన వారిని బలిగొంది. అక్కడ పడి ఉన్న సెల్‌ఫోన్లలో పిడుగుపాటు దృశ్యాలు ఉన్నాయి.

రాజస్థాన్‌లో కనీసం 23 మంది చనిపోయి ఉంటారని , పాతిక మంది వరకూ గాయపడ్డారని రాష్ట్ర విపత్తు నిర్వహణ వ్యవహారాల అధికారి కల్పనా అగర్వాల్ తెలిపారు. నైరుతి రుతుపవనాలు దక్షిణాది నుంచి క్రమేపీ ఉత్తర, పశ్చిమ మధ్యభారతం లోతట్టు ప్రాంతాలకు విస్తరించాయి. ఈ క్రమంలో అనేక చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అయితే ఇప్పటికీ దేశంలో కొన్ని ప్రాంతాలలో రుతుపవనాలు చేరలేదు. అయితే వీటి ప్రభావంతో వర్షాలు పడుతున్న ఉత్తర భారత ప్రాంతాలలో ఇప్పుడు పిడుగుపాట్లు భారీ స్థాయిలో ప్రాణనష్టానికి దారితీశాయి. మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాలలో పిడుగులు పడిన ఘటనలలో కనీసం పది మందికిపైగా మృతి చెందారు. 11 మంది గాయపడ్డారని అధికారులు భోపాల్‌లో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News