బగ్దాద్: ఇరాక్ దేశం నసీరియా పట్టణంలోని ఓ కొవిడ్ ఆస్పత్రిలో మంగళవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 మంది కరోనా రోగులు దుర్మరణం చెందారు. మరో 61 మంది గాయపడ్డారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. అల్ హుస్సేన్ కొవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో కరోనా వార్డులో మంటలు చెలరేగాయి. ఆస్పత్రి వర్గాల సమాచారం మేరకు విపత్తు సహాయ బృందం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో కరోనా బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు ఇబ్బందులు ఉన్నాయని స్థానిక పోలీస్ అధికారి తెలిపాడు. మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పేశారు. రెండు నెలల క్రితం బాగ్దాద్ లోని ఓ కొవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ ట్యాంక్ పేలడంతో 82 మంది మృతి చెందగా 110 మంది గాయపడ్డారు.
Imam Hussain Covid-19 hospital fire reportedly kills dozens in Dhi Qaar#Iraq 🇮🇶 pic.twitter.com/hvRLprNqWn
— Aleph א (@no_itsmyturn) July 12, 2021