- Advertisement -
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఏరోస్పేస్ కంపెనీ బోయింగ్ నుంచి జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానం పి-81 పరంపరలో 10వ విమానం భారతీయ నౌకాదళానికి చేరింది. భారత రక్షణ మంత్రిత్వశాఖ 2009లో 8 పి-81 యుద్ధ విమానాల కొనుగోలు కోసం బోయింగ్‌తో ఒప్పందం చేసుకుంది. కాగా, మరో 4 విమానాల కొనుగోలుకు సంబంధించి 2016లో మరో ఒప్పందం చేసుకుంది. 2016లో చేసుకున్న ఒప్పందం మేరకు బోయింగ్ నుంచి రెండవ పి-81 విమానం అందినట్లు ప్రభుత్వం మంగళశారం ఒక ప్రకటనలో తెలిపింది. దేశ రక్షణావసరాలకు నౌకాదళంలో సేవలందచేయడంతోపాటు ప్రకృతి విపత్తులు, ఇతర మానవతా సంబంధ కార్యకలాపాలలో పి-81 సేవలను ఉపయోగించుకుంటున్నట్లు ప్రకటనలో తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో తొమ్మిదవ పి-81 యుద్ధ విమానాన్ని నౌకాదళం అందుకుంది.
Indian Navy received 10th P-8I Fighter Jet
- Advertisement -