Friday, November 22, 2024

ఎపి సిఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

- Advertisement -
- Advertisement -

Jagan Mohan Reddy illegal assets case

హైదరాబాద్: సిబిఐ కోర్టులో ఎపి సిఎం జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ మంగళవారం నాడు జరిగింది. ఈక్రమంలో పెన్నా సిమెంట్స్ కేసులో జగన్ డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరు తొలగించాలని జగన్ కోరారు. మంత్రి సబిత ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సిబిఐ గడువు కోరింది. పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరు తొలగించాలని ఆమె కూడా కోరారు. సబిత డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారణ ఈనెల 22కి సిబిఐ కోర్టు వాయిదా వేసింది. రాజగోపాల్, శామ్యూల్ డిశ్చార్జి పిటిషన్లపై విచారణ ఈనెల 22కి వాయిదా పడింది. ఇండియా సిమెంట్స్ కేసు విచారణ ఈనెల 23కి సిబిఐ కోర్టు వాయిదా వేసింది.

Jagan Mohan Reddy illegal assets case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News