Friday, November 22, 2024

వ్యవసాయ శాఖపై కేబినెట్ లో చర్చ

- Advertisement -
- Advertisement -

CM KCR Cabinet Meeting Second Day

హైదరాబాద్: ఏడేళ్లలో వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని సిఎం కెసిఆర్ ప్రస్తావించారు. వ్యవసాయానికి నాణ్యమైన నిరంతర విద్యుత్ అందిస్తున్నామని సిఎం పేర్కొన్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. నేడు మంత్రి మండలి సమావేశంలో కెసిఆర్ మాట్లాడారు. రైతుబంధు కింద రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. సకాలంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. దీంతో తెలంగాణలో వ్యవసాయ సాగు విస్తీర్ణం చాలా పెరిగిందని పేర్కొన్నారు. గతేడాది రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందన్నారు. వచ్చే ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశముందని తెలిపారు. ఈ వానాకాలంలో కోటి 40 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతుందన్నారు. ధాన్యం నిల్వ, మార్కెటింగ్ పై దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం నిల్వ సామర్థాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు. రైస్ మిల్లుల్లో మిల్లింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చెప్పారు. నూతన రైస్ మిల్లులు, పారాబాయిల్డ్ మిల్లులను స్థాపించాలని ఆదేశించారు. నేటి స్వయం పాలనలో ఎట్లున్నది.. అనే విషయాలను ఈ సమావేశంలో సిఎం చర్చించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News