Friday, October 18, 2024

కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.2లక్షల ఆర్థికసాయం

- Advertisement -
- Advertisement -

Financial assistance to families of Journalist who died with Corona

జూలై 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి
రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు కుటుంబాలకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి మంజూరు చేసే ఆర్థికసాయం 2 లక్షల రూపాయలు పొందడానికి అర్హత గల జర్నలిస్టుల కుటుంబాల వారు జూలై 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. కోవిడ్-19తో మరణించిన కుటుంబాలకు గతంలో మాదిరిగానే 5 ఏళ్లపాటు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ లభిస్తుందని, దీంతోపాటు బాధిత జర్నలిస్టు కుటుంబంలో 10వ తరగతిలోపు చదువుకుంటున్న వారిలో గరిష్టంగా ఇద్దరికి ఒక వేయి రూపాయల చొప్పున ఉపకార వేతనం అందిస్తామని ఆయన తెలిపారు.

కోవిడ్-19తో మృతిచెందిన జర్నలిస్టులకు సంబంధించిన కుటుంబసభ్యుల దరఖాస్తుతో పాటు అక్రిడిటేషన్ కార్డు, ఐడి కార్డు, ఆధార్ కార్డు, రెండు లక్షల లోపు ఆదాయ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్, బ్యాంకు పాసు పుస్తకం, మూడు ఫొటోలు, జిల్లా వైద్యాధికారిచే కోవిడ్-19 మరణ ధృవీకరణ పత్రం జతచేయాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత జిల్లా పౌర సంబంధాల అధికారుల ద్వారా ధ్రువీకరించిన దరఖాస్తులను మీడియా అకాడమీ కార్యాలయానికి స్వయంగా గాని, పోస్టు ద్వారా గాని ఈ నెల 25వ తేదీ వరకు పంపించాలన్నారు.

గతంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి లబ్ధి పొందిన వారు, ఇప్పటికే మీడియా అకాడమీకి దరఖాస్తులు పంపినవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను కార్యదర్శి, రాష్ట్ర మీడియా అకాడమీ, హైదరాబాద్ చిరునామా: ఇంటి నెం.10-2-1, సమాచార భవన్, 2వ అంతస్తు, ఎ.సి. గార్డ్, మాసాబ్ ట్యాంక్, రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ కాంప్లెక్స్, హైదరాబాద్‌కు పంపించాలని ఆయన తెలియజేశారు. ఇతర వివరాలకు 7702526489 ఈ ఫోన్ నెంబర్‌లో సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News