- Advertisement -
10 రోజుల గడువు కోరిన సిబిఐ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ బెయిల్ రద్దకోరుతూ ఎంపి రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై సిబిఐ కోర్టులో బుధవారంనాడు మరోసారి విచారణ చేసింది. ఈనెల 8న జగన్, రఘురామకృష్ణరాజు తమ వాదనలను లిఖిత పూర్వకంగా సమర్పించిన అంశంపై వాదనలు కొనసాగాయి. ఈక్రమంలో సిబిఐ తన వైఖరి మార్చుకోవడంతో పాటు లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని పేర్కొంది. ఇందుకోసం 10 రోజులు గడువు కావాలని ధర్మాసనాన్ని సిబిఐ కోరింది. ఇదిలావుండగా సిబిఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందని ఎంపి రఘురామ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. తొలుత సిబిఐ వాదించేది ఏదీ లేదని, పిటిషన్‌లోని అంశాలను చట్టపరిధిలో, విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది.
- Advertisement -