Saturday, November 23, 2024

రామాలయం నిర్మాణ పనులను సమీక్షించిన కమిటీ చైర్మన్

- Advertisement -
- Advertisement -

Ayodhya temple construction panel chief reviews

అయోధ్య: అయోధ్యలో ఆలయ నిర్మాణ పనులపై రామాలయం నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్రమిశ్రా బుధవారం సమీక్ష నిర్వహించారు. సమీక్షా సమావేశానికి శ్రీరామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు చంపత్‌రాయ్, అనిల్‌మిశ్రా, అయోధ్య కమిషనర్ ఎంపి అగర్వాల్, జిల్లా కలెక్టర్ అనూజ్‌కుమార్‌ఝా, నిర్మాణ సంస్థలైన లార్సెన్ అండ్ టర్బో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రతినిధులు హాజరయ్యారు. ఆలయం పునాది పనులను మిశ్రా పరిశీలించారు. అక్టోబర్ మొదటి వారం వరకల్లా పునాది నిర్మాణం పూర్తవుతుందని అనిల్‌మిశ్రా తెలిపారు. ఆలయ పునాదిని 400 అడుగుల పొడవుతో, 300 అడుగుల వెడల్పుతో,50 అడుగుల లోతున నిర్మిస్తున్నారు.

Ayodhya temple construction panel chief reviews

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News