Saturday, November 23, 2024

దేశ‌ద్రోహ చ‌ట్టం అవసరమా?: సుప్రీం కోర్టు

- Advertisement -
- Advertisement -

Is it needed After 75 years Independence?: SC

న్యూఢిల్లీ: దేశద్రోహ చట్టం సెక్షన్ 124(ఏ)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.దేశద్రోహ చట్టం సెక్షన్ 124(ఏ)ని రద్దు చేయాలంటూ మాజీ సైనికాధికారి ఎస్‌జి వొంబట్కేరే దాఖలు చేసిన పిటిషన్‌ ను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ధర్మాసనం విచారించింది. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత కూడా సెక్షన్ 124(ఏ) ఇంకా అవసరమా? అని ప్రశ్నించింది. దేశద్రోహ చట్టం..  బ్రిటీషర్లు సమరయోధులను అణిచివేసేందుకు ఉపయోగించిన వలస చట్టమని, మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్ వంటి నేతలకు వ్యతిరేకంగా ఉపయోగించిన చట్టమని న్యాయస్థానం పేర్కొంది. అలాంటి చట్టం ఇప్పుడు కూడా అవసరమా అని అటార్నీ జనరల్ వేణుగోపాల్ ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సెక్షన్ 124(ఏ)ని దుర్వినియోగ పరచడం, జవాబుదారీ తనం లేకపోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అనేక చట్టాలను రద్దు చేస్తోందని, ఈ చట్టంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదో తెలియడం లేదని కోర్టు చెప్పింది. ఈ చట్టంపై నమోదై పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను ఒకేసారి పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎన్వీ రమణ తెలిపిరు.

 

Is it needed After 75 years Independence?: SC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News