Wednesday, November 27, 2024

యుపిఎస్‌సి పరీక్ష సజావుగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

- Advertisement -
- Advertisement -

UPSC exam should be conducted smoothly: Additional Collector

హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీసు కమీషన్ ద్వారా జూలై 16న నిర్వహించనున్న ఇండియన్ ఎకానమిక్ సర్వీస్, ఇండియన్ స్టాటికల్ సర్వీసు, కంబైన్డ్ జియో సైంటిస్టు పరీక్షల, ఇంజనీరింగ్ సర్వీసెస్ 2021 పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లో 16న ఇండియన్ ఎకానమిక్ సర్వీసు రెండు కేంద్రాలలో 492మంది అభ్యర్దులు, ఇండియన్ స్టాటికల్ సర్వీస్ రెండు కేంద్రాల్లో 827మంది, ఈనెల 17న, 18 తేదీలో జరిగే కంబైన్డ్ జియో సైంటిస్టు పరీక్ష కేంద్రంలో 15మంది అభ్యర్దులు 18న జరిగే ఇంజనీరింగ్ సర్వీస్ మొత్తం 29 కేంద్రాల్లో 12,368 మంది అభ్యర్దులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.

ఆ పరీక్షలు రెండు సెషన్లలో ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయన్నారు. అభ్యర్దులు డౌన్‌లోడ్ చేసుకున్న ఈ-ఆడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డును తప్పనిసరిగా తమ వెంట తీసుకురావాలన్నారు. ఈపరీక్షకు హాజరయ్యే అభ్యర్దులు కోవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు, శానిటైజర్, భౌతికదూరం పాటించాలని తెలిపారు. మాస్కులు లేని అభ్యర్దులను పరీక్షకు అనుమతించరని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహకులు, అభ్యర్దులు మాస్కులు,అభ్యర్దులు తప్పకుండా మాస్కులు ధరించాలని తెలిపారు. గంట ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెస్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించడం జరగదన్నారు. మొబైల్‌పోన్లు, ట్యాబ్లెట్స్, పెన్ డ్రైవ్, వాచీలు, క్యాలుక్యులేటర్లు, లాగ్‌టెబుల్స్, పర్సులు, వాలెట్స్, నోట్సులు, చాట్స్ ఇతర రికార్డింగుల పరికరాలు పరీక్ష కేంద్రాల్లో అనుమతించడం జరగదన్నారు. హాల్ టికెట్లో సూచించిన పరీక్ష కేంద్రాల్లో మాత్రమే పరీక్షకు హాజరు కావాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వెన్యూ సూపర్‌వైజర్లతో పాటు,లోకల్ ఇన్‌స్పెక్షన్ అధికారులు ఉంటారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News