స్పెయిన్ పరిశోధకుల ఆవిష్కరణ
మాడ్రిడ్ : వ్యక్తుల్లో కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ తీరు ఏ విధంగా ఉంటుందో సమర్ధంగా పర్యవేక్షించడానికి దోహదం చేసే కొత్త రక్త పరీక్షను స్పెయిన్ లోని యుఎంహెచ్‌సిఎస్‌ఐసి న్యూరోసైన్సెస్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఎసిఇ2 అనే ప్రొటీన్ పరిమాణాన్ని నిర్ధారించడం ద్వారా ఇది పనిచేస్తుంది. సాధారణంగా కణాల్లోకి ఏసిఇ2 ద్వారానే కరోనా వైరస్ ప్రవేశిస్తుంది. ఈ ప్రొటీన్‌తో వైరస్ కలిసినప్పుడు ఏసిఇ2 తునకలు (ఫ్రాగ్మెంట్లు) ఏర్పడతాయి. వ్యక్తుల్లో కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ప్లాస్మాలో పూర్తి స్థాయి పరిమాణంతో కూడిన ఏసిఇ2 స్థాయిలు తక్కువగా ఉంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదే సమయంలో వాటి ఫ్రాగ్మెంట్లు సంఖ్య పెరుగుతున్నట్టు నిర్ధారించారు. కరోనా నుంచి కోలుకున్న తరువాత ఈ రెండింటి స్థాయిలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. తాము అభివృద్ధి చేసిన రక్త పరీక్షతో ఎసిఇ2, దాని తునకల పరిమాణాలను గుర్తించ వచ్చునని, రక్తంలో వాటి స్థాయిలు కరోనా పరిణామ తీరుకు జీవ సూచికంగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Blood test can track the evolution of corona infection