Saturday, November 23, 2024

మైనారిటీల భద్రత, సంక్షేమం, అభ్యున్నతికి కోసం కెసిఆర్ కృషి: అక్బర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో మైనారిటీలు ప్రశాంతంగా జీవిస్తున్నారు
రాష్ట్రాన్ని కెసిఆర్ అన్ని రంగాలలో దేశం మొత్తం మీద ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారు
మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అక్బర్ హుస్సేన్

హైదరాబాద్: ముస్లింల భద్రత, సంక్షేమం, అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అంకితభావంతో ముందుకు సాగుతున్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ అక్బర్ హుస్సేన్ తెలిపారు.  మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రితో అక్బర్ హుస్సేన్, ముస్లిం నేతలు కొద్దిసేపు సమావేశమై కెసిఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి చర్చించారు.

కేవలం మూడు ఏండ్లలో 4,728 మందికి స్వయం ఉపాధి కోసం 55 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. 5,231 మందికి శిక్షణనిచ్చి పేరొందిన ఐటి కంపెనీలలో ఉద్యోగాలిప్పిచ్చామన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 18 వందల మందికి ఆటోలు, 300మంది డ్రైవర్లకు 60% సబ్సిడీతో కార్లు ఇచ్చామని చెప్పారు. అగరుబత్తీలు అమ్ముకునే ఫకీర్లకు 50వేల విలువైన మోపెడ్లను ఉచితంగా అందించామని హుస్సేన్ వివరించారు. ఆయనతో పాటు వక్ఫ్ బోర్డు సభ్యుడు వహీద్ అహ్మద్, జహంగీర్ హుస్సేన్, డాక్టర్ ముఫ్తీ మహ్మద్ మస్తానలీ ఖాద్రీ, మహ్మద్ అబ్దుల్ రహీం, సయ్యద్ ఫహీం, మహ్మద్ నాసిర్ మొయినుద్దీన్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News