రూ.41లక్షలు కాజేసిన నైజీరియన్
హైదరాబాద్: హెర్బల్ ప్రాడక్ట్ సప్లయ్ చేస్తామని చెప్పి భారీగా డబ్బులు తీసుకుని ఓ ఆయుర్వేద వైద్యురాలిని ఐవరీ కోస్ట్‌కు చెందిన సైబర్ నేరుస్థడు మోసం చేశాడు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని మెహిదిపట్నంకు చెందిన శైల కుమారి ఫేస్‌బుక్‌లో ఐవరి కోస్ట్ దేశానికి చెందిన మస్సి డాంకోఫ్రాంక్ పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో బాధితురాలు తాను హెర్బల్ ప్రొడక్ట్ తయారు చేస్తానని చెప్పింది. దీంతో వెంటనే నిందితుడు ప్లాన్ వేశాడు. తను హెర్బల్ ప్రోడక్ట్ సప్లయ్ చేస్తానని చెప్పాడు. దాదాపుగా రూ.5కోట్ల విలువైన ప్రోడక్ట్ చేస్తామని చెప్పడంతో ముందుగా వైద్యురాలు రూ.41లక్షలు ఆన్‌లైన్ ద్వారా పంపించింది. తర్వాత నిందితుడు స్పందించడం మానివేశాడు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడు ఢిల్లీలో ఉంటూ ఆఫ్రికాలో ఉంటున్నట్లు చెబుతు మోసం చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిదితుడిని ఢిల్లీలో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Nigerian cyber criminal cheated an Ayurvedic doctor