Saturday, November 23, 2024

ఇన్‌స్టాగ్రాంలో వేధింపులు

- Advertisement -
- Advertisement -

Harassment on Fake Instagram in Hyderabad

హైదరాబాద్: ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఐడి క్రియేట్ చేసి వేధింపులకు పాల్పడుతున్న నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… హైదరాబాద్, బాలానగర్‌కు చెందిన లలిత్‌కుమార్ జైన్ తనతోపాటు చదువుకుంటున్న యువతి ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతు వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఐడి క్రియేట్ చేసి యువతి మార్ఫింగ్ ఫొటోలు అందులో పోస్టింగ్ చేస్తూ ఆమె క్యారెక్టర్‌ను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో తన అసభ్య ఫొటోలు పోస్టింగ్ చేస్తుండడంతో వాటిని చూసిన బాధితురాలు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని గుర్తించారు. యువతితోపాటు చదువుతున్న లలిత్‌ను గుర్తించి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News