- Advertisement -
ఉత్తరాఖండ్: కొవిడ్ నియంత్రణలో మాస్కు ప్రాముఖ్యతను ప్రభుత్వాలు, నిపుణులు నొక్కి చెబుతున్నా ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. నలుగురికి అవగాహన కల్పించాల్సిన వారు కూడా దానిని విస్మరిస్తున్నారు. ప్రభుత్వంలోని పెద్దలే కరోనా నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. మాస్కులు పెట్టుకోకుండా సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఉత్తరాఖండ్లో బిజెపికి చెందిన ఐదుగురు నేతలు ఒక్కచోట సమావేశమయ్యారు. అందులో ముగ్గురు మంత్రులున్నారు. వారిలో ఒక్కరూ మాస్కు ధరించలేదు. ఉన్న మాస్కును పక్కకు తొలగించి ఒకరు మాట్లాడుతుండగా.. మంత్రి యతీశ్వరానంద్ ఏకంగా మాస్కును కాలి వేలికి తగిలించుకున్నారు. ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Uttarakhand minister’s mask seen hanging on foot
- Advertisement -