Saturday, November 23, 2024

ప్రయాణికులకు అందుబాటులోకి 82 రైళ్లు

- Advertisement -
- Advertisement -

82 trains Available to South Central Railway passengers

హైదరాబాద్: రైలు ప్రయాణం సులభతరం చేయడంలో భాగంగా 82 రైళ్లను దక్షిణమధ్య రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ఎక్స్‌ప్రెస్‌తో పాటు స్పెషల్ రైళ్లు ఉన్నాయి. గతంలో ప్రయాణికులకు సేవలందించిన ప్యాసింజర్ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌తో పాటు స్పెషల్ రైళ్ల రూపంలో నడవనున్నట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 1621 ఎక్స్‌ప్రెస్ స్పెషల్ సర్వీసులతో పాటు 66 ప్యాసింజర్ స్పెషల్ సర్వీసెస్ రైళ్లను జూలై 19వ తేదీ నుంచి ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చామని రైల్వే శాఖ తెలిపింది. రైల్వే ప్రయాణికులు ముఖ్యంగా కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు తెలిపారు. మాస్క్‌లను ధరించడంతో పాటు భౌతికదూరం పాటించాలని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

82 trains Available to South Central Railway passengers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News