Saturday, November 23, 2024

ఈనెల 21వ తేదీన అల్పపీడనం

- Advertisement -
- Advertisement -

Heavy rains likely across Telangana in next 3 days

నారాయణపేట 132.3 మిల్లీమీటర్ల వర్షపాతం
రాగల మూడురోజులు రాష్ట్రవ్యాప్తంగా
ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

హైదరాబాద్: ఈ నెల 21వ తేదీన వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు, రేపు, ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

హిమాలయ పర్వత శ్రేణికి చేరువగా

నైరుతి రుతు పవనాల ద్రోణి హిమాలయ పర్వత శ్రేణికి చేరువగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ఒకటి కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలో మీటర్ల మధ్యలో ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. తూర్పు-పశ్చిమ ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ వైపు వంపు తిరిగి ఉందని అధికారులు తెలిపారు.

మహబూబ్‌నగర్‌లో 118.8

శనివారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట 132.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, వనపర్తిలో 123.8, మహబూబ్‌నగర్‌లో 118.8, నల్లగొండలో 101, నాగర్‌కర్నూల్‌లో 80.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Heavy rains likely across Telangana in next 3 days

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News