Friday, November 22, 2024

కృష్ణానదికి భారీ వరద

- Advertisement -
- Advertisement -

Heavy Flood Inflow to Krishna River

-= జురాల ఐదు గేట్లు ఎత్తివేత
-= దిగువకు 60వేల క్యూసెక్కుల నీటి విడుదల
= సుంకేసుల గేటు ఎత్తివేత
= శ్రీశైలంకు 59 వేల 650 క్యూసెక్కుల నీటి విడుదల

నాగర్‌కర్నూల్: కృష్ణానదికి భారీ వరద వస్తుంది. శనివారం జూరాల ప్రాజెక్టుకు 61వేల 700 క్యూసెక్కుల భారీ వరద రావడంతో జూరాల వద్ద అధికారులు ఐదు గేట్లను ఎత్తి 20వేల 760 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అదే విధంగా జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా 36వేల 659 క్యూసెక్కుల నీటిని దిగువ శ్రీశైలంకు వదులుతున్నారు. దీంతో నెట్టెంపాడు సమాంతర కాలువ , ఎడమ కాలువ ద్వారా మొత్తం 56వేల 564 క్యూసెక్కుల నీరు జూరాల ప్రాజెక్టు నుంచి విడుదల అవుతుంది .జూరాల నీటి స్థాయి పూర్తి మొత్తం 9.296 టిఎంసీలకు గానూ ప్రస్తుతం 5.589 టిఎంసీల నీరు నిల్వ ఉంది. అదే విధంగా శ్రీశైలం జలాశయానికి జూరాల ఐదు గేట్లు ఎత్తడం ద్వారా 20వేల 760 క్యూసెక్కులు,జూరాల జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 36వేల 659 క్యూసెక్కులు, తుంగభద్ర నది పై గల సుంకేసుల ఒక గేటు ఎత్తడం ద్వారా 2.231 క్యూసెక్కుల చొప్పున శ్రీశైలం వైపుకు 60వేల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుంది.

ఇదిలా ఉండగా శ్రీశైలం డ్యాం వైపుకు 38వేల 364 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా 6.357 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ 812.90 అడుగులుగా నమోదైంది. 215.507 టిఎంసీలకు గానూ ప్రస్తుతం 36.0358 టిఎంసీలుగా నమోదైంది. ఎగువ నారాయణపూర్ నుండి 60వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండడంతో అంతే మోతాదులో దిగువకు నీటిని విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఐదు గేట్లను ఎత్తడం ద్వారా దిగువ శ్రీశైలంకు వదులుతున్నారు.శనివారం సాయంత్రం 3 గంటల 30 నిమిషాలకు జూరాల ఐదు గేట్లు ఎత్తిన అధికారులు ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహానికి అనుగుణంగా రాత్రివరకు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

కర్ణాటకలోని అలమట్టి ప్రాజెక్టుకు 53 వేల 502 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 42వేల 264 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. నారాయణపూర్ డ్యాంకు 45.629 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 40 వేల 608 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదు అయ్యింది. తుంగభద్రనదికి 46వేల 54 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 481 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదు అయ్యింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 7 వేల 454 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 5188 ఔట్‌ఫ్లో నమోదు అయ్యింది. పులిచింతల ప్రాజెక్టుకు 22వేల 758 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 600 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదు అయ్యింది. కృష్ణా డెల్టా సిస్టంకు 8686 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా 9 వేల 334 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదు అయ్యింది. ఎగువ కర్ణాటక,మహారాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ప్రవాహం పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News