Tuesday, November 19, 2024

రెండు డోసులు తీసుకున్న బ్రిటన్ ఆరోగ్యమంత్రికి కరోనా

- Advertisement -
- Advertisement -

Corona to UK Health Minister who took two doses

లండన్ : బ్రిటన్ ఆరోగ్యమంత్రి సాజివ్ జావిద్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్టారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారిని కూడా కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని ఆయన సూచించారు. దీంతో బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, ఆర్థిక మంత్రి రిషిసునక్‌లు ఐసొలేషన్‌లో ఉంటున్నట్టు బ్రిటన్ ఆరోగ్యశాఖ ప్రకటించింది. కేవలం స్వల్ప లక్షణాలే తనకు ఉన్నాయని జావిద్ పేర్కొన్నారు. బ్రిటన్ జాతీయ హెల్త్ సర్వీస్ నిబంధనల ప్రకారం పాజిటివ్ సోకిన వ్యక్తులు పది రోజుల పాటు సెల్ఫ్ ఐసొలేషన్‌లో ఉండాలి. ఆర్‌టిపిసిఆర్ నివేదిక నెగిటివ్ వచ్చిన తరువాతనే విధులకు హాజరు కావలసి ఉంటుంది. కొవిడ్ ఆంక్షలను సడలించడానికి సిద్ధమైన తరుణంలో బ్రిటన్‌లో కరోనా మరోసారి ముమ్మరంగా వ్యాపిస్తోంది. ఈ ఏడాది జనవరి తరువాత రోజు వారి కేసులు మొదటిసారి 50 వేలు దాటాయి. రానున్న వారాల్లో ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉందని ఆరోగ్యమంత్రి జావెద్ వెల్లడించారు. ఇదే సమయంలో వైరస్ నుంచి ఎవరికీ రక్షణ లేదనే విషయం జావెద్‌కు పాజిటివ్ రావడం వల్ల అర్ధమవుతోంది.

Corona to UK Health Minister who took two doses

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News