Saturday, November 23, 2024

దర్భంగా పేలుడు లష్కరేతోయిబా పనే: ఎన్‌ఐఎ

- Advertisement -
- Advertisement -

Darbhanga blast: 2 accused sent to remanded till July 23

దర్భంగా పేలుడు లష్కరేతోయిబా పనే: ఎన్‌ఐఎ
నిందితులకు ముగిసిన కస్టడి…ఈనెల 23 వరకు రిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్: దర్భంగా బ్లాస్ట్ కేసులో దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఎ ఈ పేలుడు వెనుక లష్కరే తొయిబా ముఖ్యనేత ఇక్బాల్ ఉన్నట్టు ఎన్‌ఐఏ వెల్లడించింది. కాగా ఈ కేసులోని నిందితుల కస్టడీ ముగియడంతో నిందితులకు ఈనెల 23వరకు రిమాండ్ విధించారు. ఈక్రమంలో నిందితులను కస్టడీలో విచారించిన ఎన్‌ఐఎ అనేక కీలక విషయాలు రాబట్టింది. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్‌తో పాటు అండర్ వరల్ డాన్ టైగర్ మెమేన్ ఆదేశాలతో భారత్‌లో పేలుళ్లకు కుట్ర చేసినట్లు అధికారులు నిర్థారించారు. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసేందుకు ఇక్బాల్ సొంత గ్రామం ఖైరానాకు చెందిన వారితో పరిచయాలు పెంచుకున్నట్లు గుర్తించారు. దర్భంగా బ్లాస్ట్ కేసులో ఖలీం అనే మరో వ్యక్తి పాత్ర కూడా బయటపడింది.

పాకిస్తాన్ నుండి ఇక్బాల్ ఖానా ఆదేశాలు ఇచ్చేందుకు సోషల్ మీడియా ద్వారా వాయిస్ కాల్స్ చేసినట్లు నిర్థారణ అయ్యింది. హాజీ సలీమ్‌కి ఇంటర్నెట్ పై అవగాహన లేకపోవడంతో ఖలీం అనే వ్యక్తి సహాయం తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఖలీం సోషల్ మీడియా ఖాతా ద్వారా హాజీ సలీమ్ తో ఇక్బాల్ ఖానా వాయిస్ కాల్స్ మాట్లాడినట్లు విచారణలో తేలింది. ఒక్కో బ్లాస్ట్ కు కోటి రూపాయల నజరానా ఇస్తామని మాలిక్ సోదరులకు ఇక్బాల్ ఆశ చూపినట్లు విచారణలో వెల్లడైంది. 2012లో పాకిస్థాన్ ఆఫ్గన్ సరిహద్దులో ముఖ్య నేతలను కలిసినట్టు నజీర్ మాలిక్, హాజీ సలీం అంగీకరించారని ఎన్‌ఐఎ అధికారులు వెల్లడించారు.

Darbhanga blast: 2 accused sent to remanded till July 23

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News